తమిళ హీరో తలపతి విజయ్ వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీలో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ధృవీకరించేశారు. తమిళనాట పొత్తులు లేకుండా ఒక కొత్త పార్టీ ఒంటరిగాఎన్నికల బరిలోకి దిగడం సాహసమనే చెప్పాలి. అయితే తన అభిమానుల బలంతో తమిళ రాజకీయాలలో సొంత బాట ఏర్పాటు చేసుకోగలన్న విశ్వాసం, ధీమా విజయ్ లో వ్యక్తం అవుతున్నాయి.
అయితే తళపతి విజయ్ కు కోలీవుడ్ పరిశ్రమ మద్దతు ఏ మేరకు ఉంటుందన్న సందేమాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ అధికార పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడమే కాకుండా, పరోక్షంగా విజయ్ పై రాజకీయ విమర్శలు కూడా చేశారు. ఇక మరో హీరో కమల్ హసన్ విజయ్ కు మద్దతు ప్రకటిస్తారా అన్నిది కూడా అనుమానమే. ఇప్పటికే డీఎంకే మద్దతుతో రాజ్యసభలోకి అడుగుపెట్టిన ఈ లోక్ నాయకుడు.. బహిరంగంగా విజయ్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు. వీరిద్దరినీ పక్కన పెడితే కోలీవుడ్ పరిశ్రమలో విజయ్ వెంట నిలిచేదెవరన్న ప్రశ్న తలెత్తుతోంది. విజయ్ అభిమానులు మాత్రం తమిళ అగ్ర నటులంతా ముందుకు వచ్చి విజయ్ కు మద్దతు పలకాలని ఆశిస్తున్నారు. అయితే ప్రముఖ నటి త్రిష మాత్రం రాజకీయంగా తలపతి విజయ్ కు బహిరంగ మద్దతు ప్రకటించారని అంటున్నారు. ఇటీవల దుబాయ్ లో ఫెమా ఫంక్షన్ లో ఆమె రాజకీయంగా విజయ్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్టాఫ్ లక్ చెప్పారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ప్రముఖ స్థానంలో ఉన్న త్రిష సినీ కెరీర్ ఇప్పుడు కొద్దిగా నెమ్మదించింది. దీంతో సహజంగానే ఆమె తదుపరి అడుగు రాజకీయాలవైపు పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తలపతి విజయ్ కు ఏదో మామూలుగా బెస్టాఫ్ లక్ చెప్పలేదనీ, ముందు ముందు ఆమె తలపతి విజయ్ పార్టీ ద్వారానే రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందనీ అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actor-trisha-to-join-tala[athy-vijay-party-39-205861.html
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్‌కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్‌లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.